Ram Charan @ GMA3: పుట్టబోయే పిలల్లను ఎలా పెంచుతానంటే? అమెరికన్ షోలో ఆసక్తికర అంశాలను పంచుకున్న రామ్ చరణ్, న్యూయార్క్ లో చెర్రీ క్రేజ్ మామూలుగా లేదుగా..
RRR సినిమాతో పాటూ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్. తనకు పుట్టబోయే పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నాను, తన వైఫ్ ఉపాసన (Upasana) గురించి పలు ఆసక్తికరమైన అంశాలను ఈ షోలో పంచుకున్నారు.
New York, FEB 23: RRR సినిమాతో ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ కు (Ram Charan) అమెరికాలో ఘనస్వాగతం పలికింది. ఆయనకు వందలాది ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. వచ్చే నెల 12న జరగాల్సిన ఆస్కార్ అవార్డుల (Oscar ceremony) వేడుకల కోసం ఆయన ముందస్తుగా అమెరికా చేరుకున్నారు. RRR సినిమాలోని నాటు నాటు (naatu Naatu) సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ పాటకు ఆస్కార్ రావడం ఖాయమని ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన యూఎస్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కూడా అమెరికాకు వెళ్లనున్నారు. మరోవైపు, రామ్ చరణ్ జీఎంఏ (Good Morning America show) టెలివిజన్ షోన్ లో కనిపించారు. '
ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయంపై ఆయన మాట్లాడారు. రేపు జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు. ఇంతవరకు టాలీవుడ్ లో మరెవరికీ ఈ ఘనత దక్కలేదు. RRR సినిమాతో పాటూ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్. తనకు పుట్టబోయే పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నాను, తన వైఫ్ ఉపాసన (Upasana) గురించి పలు ఆసక్తికరమైన అంశాలను ఈ షోలో పంచుకున్నారు.