IPL Auction 2025 Live

Hindi National Language Row: హిందీ జాతీయ భాష వివాదంలోకి వచ్చేసిన వర్మ, భారతదేశం మొత్తం ఒక్కటేనని తెలుసుకోవాలని ట్వీట్, బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ పెరిగిపోతోందని విమర్శ

వీరితో పాటు వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా స్పందించారు. బాలీవుడ్ అగ్రతారలను మాటలతో ఆడేసుకున్నారు.

Ram Gopal Varma, Ajay Devgn, Kiccha Sudeep (Photo Credits: Twitter)

హిందీ జాతీయ భాష కాదంటూ కిచ్చ సుదీప్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ హాట్ చర్చకు తెరలేపింది. వీరిద్దరి మధ్యలోకి రాజకీయ నాయకులు కూడా వచ్చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలు అజయ్ దేవగన్ పై విరుచుకుపడ్డారు. వీరితో పాటు వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా స్పందించారు. బాలీవుడ్ అగ్రతారలను మాటలతో ఆడేసుకున్నారు.

హిందీలో దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తుండడంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ పెరిగిపోతోందని అన్నారు. దక్షిణాది..ఉత్తరాది కాదని, భారతదేశం మొత్తం ఒక్కటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ట్వీట్ చేశారు. ప్రాంతీయత, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలు వృద్ధి చెందాయి. భాష.. ప్రజలు దగ్గరయ్యేందుకు ఉపయోగపడాలి కానీ.. విడదీసేందుకు కాదు’’ అని ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష ఎప్పటికీ కాదు, అజయ్ దేవగన్‌పై విరుచుకుపడిన కర్ణాటక మాజీ సీఎంలు, సుదీప్‌కి అండగా నిలిచిన కుమార‌స్వామి, సిద్ధ‌రామ‌య్య‌

ఆ తర్వాత దక్షిణాది సినిమాలపై స్పందిస్తూ మరో ట్వీట్ వేశారు. ‘‘కేజీఎఫ్ 2 రూ.50 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించడంతో ఉత్తరాది తారలు దక్షిణాది స్టార్స్ పై అసూయతో ఉన్నారన్నది నిజం. ఇకపై బాలీవుడ్ సినిమాల వసూళ్లు ఎలా ఉంటాయో చూద్దాం. బాలీవుడ్ లో బంగారం ఉందా? కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్ వే 34’ కలెక్షన్లు చెప్పేస్తాయి’’ అని వర్మ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Here's Varma Tweets

కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా దక్షిణాది సినిమాలు ఉంటున్నాయని, హిందీ ఇక జాతీయ భాష కాదని ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో సుదీప్ అన్నాడు. అంతేకాదు.. హిందీ వాళ్లే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, తమిళం, తెలుగు, కన్నడలో సినిమాలను డబ్ చేస్తున్నా విజయాలను అందుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అజయ్ దేవగణ్ మండిపడ్డారు. హిందీ జాతీయ భాష కానప్పుడు.. దక్షిణాది సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు.



సంబంధిత వార్తలు