RGV Coronavirus Trailer: వర్మ 'కరోనా వైరస్' ట్రైలర్, జగన్,కేసీఆర్ పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ ట్రైలర్‌కి హైలైట్, యూట్యూబ్‌లో ట్రెండింగ్ ఇదే
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఫీచర్ ఫిల్మ్ చేసినట్లు వర్మ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన కొత్త సినిమా 'కరోనా వైరస్' ట్రైలర్‌ను (Coronavirus Trailer) యూట్యూబ్ చానెల్‌లో రిలీజ్ చేశారు. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను చూస్తున్నంత సేపు చాలా భయపెట్టేలా ఉంది.
Hyderabad, May 26: ప్రముఖ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్రెండింగ్‌లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఫీచర్ ఫిల్మ్ చేసినట్లు వర్మ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన కొత్త సినిమా 'కరోనా వైరస్' ట్రైలర్‌ను (Coronavirus Trailer) యూట్యూబ్ చానెల్‌లో రిలీజ్ చేశారు. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను చూస్తున్నంత సేపు చాలా భయపెట్టేలా ఉంది. జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్, విధివిధానాలు రూపొందించాలని ఆధికారులకు ఆదేశాలు, సినిమా హాళ్లను తిరిగి తెరవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
దీనిపై ట్విటర్‌లో వర్మ స్పందిస్తూ .. 'మా పనిని ఆ దేవుడితో పాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించుకోవాలనుకున్నాం. ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై (Varma Coronavirus Trailer) తీసిన తొలి చిత్రమిదే. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌లోనూ మావాళ్లు లాక్‌డౌన్ కాలేదంటూ' ట్వీట్ చేశారు.
Here's Ram Gopal Varma Tweet
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగర్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, డీఎస్సార్ సంగీతాన్ని అందించారు.ప్రస్తుతం కరోనా వైరస్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో భయంతోఎలా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు? వారిలో ఉన్న భయాందోళనలు ఏంటి? లాంటి అంశాలను కళ్లకి కట్టినట్టు ఈ ట్రైలర్‌లో చూపించారు. వర్మ చిత్రాల్లో తరచుగా కనిపించే.. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ ‘కరోనా వైరస్’ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేశారు. ఒక ఫ్యామిలీని కరోనా ఏవిధంగా చిన్నభిన్నం చేసిందనే కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ ప్రారంభంలో కరోనా న్యూస్.. అలాగే ఎండింగ్‌లో జగన్, కేసీఆర్‌ల పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి.