Rashmika Sweet Warning To Srikanth Kidambi: బ్యాడ్మింట‌న్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కు ర‌ష్మిక స్వీట్ వార్నింగ్, వైర‌ల్ అవుతున్న పోస్ట్

శ్రావ్య, రష్మిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌ అట. శ్రావ్యకు భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్‌కు (Srikanth Kidambi) ఈ ఏడాది ఆగస్టు 10న నిశ్చితార్థం జరిగింది. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నది. అయితే, శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి రష్మికతో పాటు పలువురు హాజరయ్యారు.

Rashmika Sweet Warning To Srikanth Kidambi

Hyderabad, NOV 03: రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు ఏదో అంశంతో వార్తల్లో నిలుస్తూ వస్తుంది నేషనల్‌ క్రష్‌. ఇటీవల రష్మిక వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. దీపావళి వేడుకలను సెలబ్రేషన్స్‌ని విజయ్‌ దేవరకొండ ఇంట్లో జరుపుకుందని.. పెళ్లికి ముందే అత్తవారింట్లో వేడుకల్లో పాల్గొందని పలువురు కామెంట్స్‌ చేశారు. ఇప్పటికే విజయ్‌, రష్మిక లవ్‌లో ఉన్నారని రూమర్స్‌ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవడం దాదాపు ఖరారైనట్లేనని నెటిజన్స్‌ పేర్కొన్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల ఇద్దరు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇంట్లో క‌నిపించింది.

Jai Hanuman First Look: జై హ‌నుమాన్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది! హ‌నుమాన్ పాత్ర‌పై వీడిన సస్పెన్స్, పాన్ ఇండియా హీరోకు ద‌క్కిన ఛాన్స్ 

తాజాగా తన స్ట్రయిలిస్ట్‌ శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్‌ పార్టీకి హాజరైంది. శ్రావ్య, రష్మిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌ అట. శ్రావ్యకు భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్‌కు (Srikanth Kidambi) ఈ ఏడాది ఆగస్టు 10న నిశ్చితార్థం జరిగింది. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నది. అయితే, శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి రష్మికతో పాటు పలువురు హాజరయ్యారు. అయితే, వేడుకను శ్రావ్య ఇన్‌స్టామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ఇదే నా చివరి లేడీ బ్యాచిలర్ పార్టీ అంటూ పోస్ట్‌ చేసింది. దీనికి రష్మిక మేడం శ్రావ్యను జాగ్రత్తగా చూసుకోవాలని.. ఇకపై తను నీదంటూ చెప్పినట్లు సమాచారం. దీనికి కిదాంబి శ్రీకాంత్ రష్మిక పోస్ట్‌కు బదులిస్తూ శ్రావ్యను మహారాణిలా చూసుకుంటానని చెప్పినట్లు తెలుస్తున్నది.

Rashmika Mandanna Sweet Warning To Srikanth Kidambi

ప్రస్తుతం, ఇది అంశం వైరల్‌గా మారింది. నాగార్జున, విజయ్‌ దేవరకొండ వద్ద శ్రావ్య పని చేసినట్లు తెలుస్తున్నది. దీంతో విజయ్‌తోనే సైతం మంచి ఫ్రెండ్ అని.. శ్రావ్య వెడ్డింగ్ ధూంధాంగా చేద్దామని రష్మిక అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో పుష్ప-2లో నటిస్తున్నది. చావ, సికిందర్‌, కుబేర, రేయిన్‌బో, ద గర్ల్స్‌ ఫ్రెండ్‌, థామా సినిమాల్లో నటిస్తున్నది.



సంబంధిత వార్తలు