Rashmika Mandanna Video On SHE Teams: నిన్న అల్లు అర్జున్, ఇవాళ రష్మిక మందనా, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్న పుష్ప టీం, అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘
Hyderabad, NOV 29: డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రత్యేక వీడియో చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’’ అని విజ్ఞప్తి చేశారు. #SayNoToDrugs వంటి పలు హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు.
CM Revanth Reddy Praises Allu Arjun
అయితే తాజాగా రష్మిక (Rashmika) కూడా తెలంగాణ పోలీసులకు సపోర్ట్ గా వీడియో చేశారు. షీ టీమ్స్ పై అవగాహన కల్పిస్తూ చేసిన వీడియోను ఆమె పోస్ట్ చేశారు. బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.
Rashmika Mandanna Special Video on SHE Team
మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అని అల్లు అర్జున్ వీడియో ద్వారా పిలుపునిచ్చారు.