Tiger Nageswara Rao Run Time Reduced: రవితేజ ఫ్యాన్స్‌కు మరింత థ్రిల్, మూవీ రన్ టైంను భారీగా తగ్గించిన యూనిట్, ఏకంగా 24 నిమిషాలు కోత పెట్టి రిలీజ్
అయితే ఈ మూవీ నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.
Hyderabad, OCT 21: మాస్ మహారాజ రవితేజ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా రేణు దేశాయ్ (Renu Desai), అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వారం అక్టోబర్ 20న ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ట్రైలర్ అండ్ టీజర్స్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్స్ లో మంచి టాక్ నే సొంతం చేసుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే ఎలివేషన్స్ తో మాస్ ఆడియన్స్ కి మంచి కిక్‌నే అందజేస్తుంది. అయితే ఈ మూవీ నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. అది కొంచెం తగ్గించి ఉంటే.. ఆడియన్స్ కి మరింత థ్రిల్ కలిగే ఛాన్స్ ఉందని టాక్ (Run Time Reduced) వినిపిస్తుంది. ఇక టాక్ మూవీ టీం వరకు చేరుకుంది అనుకుంటా. నిడివి తగ్గిస్తూ కొత్త ప్రింట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.