Actor Vivekh Passes Away: వ్యాక్సిన్ వేయించుకున్న 2 రోజులకే గుండెపోటు, ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత, సంతాపం తెలిపిన రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు
గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస (Actor Vivekh Passes Away) విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు.
ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస (Actor Vivekh Passes Away) విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు. దర్శకుడు కె.బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. 'మనదిల్ ఉరుది వేండం' ద్వారా ఆయన సినీ ఆరంగేట్రం చేశారు.
రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్‌తో కలిసి ఆయన నటించారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో (Rest In Peace Vivekh) తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
తమిళంలో టాప్ కమెడియన్‌గా వివేక్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనను 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాలతో వివేక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ కొడుకు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు.
అనారోగ్యం కారణంగా వివేక్ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు తెలిపారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
వివేక్ మృతి పట్ల రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, మాధవన్, దేవీశ్రీ ప్రసాద్, ఏఆర్. రెహమాన్, సుహాసిని, ప్రకాశ్‌రాజ్, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్, సూరి సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నా స్నేహితుడు వివేక్ ఇంత త్వరగా వదిలి వెళతాడని ఊహించలేదు. ఆలోచనలు మరియు చెట్లను నాటినందుకు ధన్యవాదాలు. మీ తెలివి తేటలు, కామెడీతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం అని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు .
లెజెండ్ ఇక లేరని నమ్మలేకపోతున్నాం. మీతో పని చేసిన క్షణాలు ఎప్పుడు మా మదిలో నిలిచి ఉంటాయి. కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను – మోహన్ రాజా
వివేక్ లేడనే వార్త పెద్ద షాకింగ్. ఎంతో చురుకైన వ్యక్తి ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. మీరు ఉన్నన్ని రోజుల మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు కన్నీళ్లు, బాధలను మిగిల్చి వెళ్లారు అంటూ ఖుష్బూ భావోద్వేగంతో ట్వీట్ చేసింది.
హాస్యనటుడు వివేక్ మృతిపట్ల తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్భుతమైన నటనతో చిన్న కలైవానర్‌గా పేరుతెచ్చుకుని కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. తన తమ్ముడిలాంటి వివేక్ ఇక లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వివేక్ కుటుంబ సభ్యులకు సత్యరాజ్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.