RRR First Song Dosti: ఆర్‌ఆర్‌ఆర్ థీమ్ సాంగ్..స్నేహం విలువను తెలియజేసే గీతం, ఆగస్టు 1న ఆర్‌ఆర్‌ఆర్ తొలి సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్, సంగీతం సమకూర్చిన ఎం.ఎం. కీరవాణి
ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది.
ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్ర ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా అప్ డేట్ పై అందరి కళ్లు ఉన్నాయి. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ సినిమా తొలి పాటను (RRR First Song Dosti) ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆగస్ట్ 1న ఉయదం 11గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. కాగా, ప్రమోషన్‌లో భాగంగా‘ఆర్‌ఆర్‌ఆర్ థీమ్ సాంగ్’ పేరిట చిత్రబృందం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారనే విషయం తెలిసిందే. ‘దోస్త్’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌లో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొనగా, రీసెంట్‌గానే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారని సమాచారం. ఆగస్ట్ 1న ఈ పాటను విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ఈ ప్రత్యేక పాటను ఎవరు ఆలపిస్తున్నారో కూడా తెలియజేశారు.
Here's RRR Tweet
తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆ పాటను ఆలపించినట్లు ఫోటో ద్వారా తెలియజేశారు. స్నేహం విలువని తెలియజేసే గీతమిదని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.