RRR Movie: హోంమంత్రి అమిత్‌షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. ట్వీట్ చేసిన అమిత్ షా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ రావడంపై హర్షం.. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందన్న మంత్రి

అకాడమీ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను కలిశారు.

Credits: RRR Ramcharan

Newdelhi, March 18: ఆస్కార్ అవార్డ్ (Oscar Award) సాధించిన ఆర్ఆర్ఆర్ (RRR) టీమ్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అకాడమీ అవార్డ్స్ కోసం  అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), తండ్రి చిరంజీవితో (Chiranjeevi) కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి  అమిత్‌షాను (Amit Shah) కలిశారు. ఈ సందర్భంగా కాసేపు ముగ్గురు ముచ్చటించుకున్నారు. అనంతరం ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం.. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలను కలవడం ఆనందంగా ఉందని షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్ అద్భుత విజయం, నాటునాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు రామ్‌చరణ్‌ను అభినందించినట్టు పేర్కొన్నారు. కాగా,  ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ్‌చరణ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

కాంగ్రెస్‌ రహిత కొత్త ఫ్రంట్‌కోసం తొలి అడుగు, అంగీకరించిన మమతా బెనర్జీ- అఖిలేష్ యాదవ్, త్వరలోనే నవీన్ పట్నాయక్‌తోనూ అఖిలేష్ భేటీ