Naga Chaitanya- Sobhita Dhulipala: నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..సోషల్ మీడియాలో వైరల్‌, నాగార్జున క్లారిటీ ఇచ్చేనా?

అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయా?, నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇవాళ నటి శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ జరగనుందా? సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై కింగ్ నాగార్జున స్పందిస్తారా?, ఇప్పుడు ఇదే టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Rumors on Naga Chaitanya - Sobhita Dhulipala engagement(X)

Hyd, Aug 8: అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయా?, నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇవాళ నటి శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ జరగనుందా? సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై కింగ్ నాగార్జున స్పందిస్తారా?, ఇప్పుడు ఇదే టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కొద్దిరోజులుగా కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. అయితే ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పుడు ఖండించలేదు. కానీ తాజాగా సీన్ కట్ చేస్తే ఇవాళ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగబోతుందని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇందుకు సంబంధించిన నాగార్జున అఫిషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

2013 ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విన్నర్‌ శోభిత ధూళిపాళ్ల. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చిన శోభిత.. 2016లో తొలిసారి వెండితెరపై కనిపించింది. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో రామన్‌ రాఘవ్‌ మూవీలో ఆ తర్వాత మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. 2018లో వచ్చిన గూఢాచారి,2022లో వచ్చిన మేజర్‌ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించింది. మ‌ళ్లీ రిపీట్ అవుతున్న మిర‌ప‌కాయ్ కాంబినేష‌న్, ఆగ‌స్ట్ 15న ర‌చ్చ లేప‌నున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ 

2021 అక్టోబర్‌లో సమంతతో విడిపోతున్నట్లు ప్రకటించారు నాగచైతన్య. తర్వాత ఎవరికి వారు తమ సినీ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. నిజంగానే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఇవాళ జరగనుందా, దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందా వేచిచూడాలి.



సంబంధిత వార్తలు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ