
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలు అంతా ఇంతా కాదు. తాజాగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివి వినాయక్ అనారోగ్యం గురించి అనేక ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ఫేక్ వార్తలపై ఆయన టీమ్ తాజాగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఒక నోట్‌ను కూడా టీమ్ విడుదల చేసింది.
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీమ్ పేర్కొంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేసింది. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన టీమ్ హెచ్చరించింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా రూపొందిన వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే.