Sai Dharam Tej In Controversy: వివాదంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, శ్రీకాళహస్తిలో నియమాలను ఉల్లంఘించి హారతి ఇచ్చిన సాయి
కాగా అక్కడ సాయి ధరమ్ తేజ్ స్వయంగా సుబ్రమణ్యస్వామి వారికి హారతి ఇచ్చాడు. అయితే ఆలయ నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలి. కానీ నియమాలకు విరుద్దంగా సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడం వివాదాస్పదమైంది.
Tirupathi, July 15: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వివాదంలో (Sai Dharam Tej) చిక్కుకున్నాడు. బ్రో ప్రమోషన్‌లో (BRO) భాగంగా ఈ సినిమాలోని సినిమాలోని సెకండ్ సింగిల్‌ను శనివారం తిరుపతిలోని ఓ థియేటర్‌లో రిలీజ్ చేయనున్నారు. దీనికోసం శుక్రవారమే తిరుపతికి వచ్చిన సాయిధరమ్.. అక్కడే ఉన్న శ్రీకాళహస్తి (Srikalahastri) ఆలయాన్ని దర్శించుకున్నాడు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. కాగా అక్కడ సాయి ధరమ్ తేజ్ స్వయంగా సుబ్రమణ్యస్వామి వారికి హారతి ఇచ్చాడు. అయితే ఆలయ నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలి. కానీ నియమాలకు విరుద్దంగా సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడం వివాదాస్పదమైంది. పైగా ఆలయ చైర్మన్, ఇతర ఆలయ అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో సాయిధరమ్ తేజ్‌తో పాటు ఆలయ అధికారులపై కూడా భక్తులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక బ్రో మూవీ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ పలు మార్పులు, చేర్పులు చేశాడు.