Salman Khan in Self-Isolation (Photo Credits: Instagram)

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ హోమ్‌ క్వారంటైన్‌లోకి (Salman Khan in Self-Isolation) వెళ్లాడు.తన వ్యక్తిగత డ్రైవర్‌, ఇద్దరు సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడటంతో తన కుటుంబంతో కలిసి 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. తన సిబ్బందికి కరోనా వైరస్‌ పరీక్షల్లో పాజిటివ్‌ (COVID-19 Positive) అని తేలిన వెంటనే వారిని ముంబై ఆసుపత్రిలో చేర్పించాడు. వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సల్మాన్‌ పేరెంట్స్‌ సలీం ఖాన్- సల్మా ఖాన్ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని సైతం రద్దు చేశారు.

ఇదిలా ఉంచితే హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న బిగ్‌బాస్‌-14 రియాల్టీ షోకు సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో హిందీ బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ వ్యవహారం సందిగ్థంలో పడింది. 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్న సల్మాన్‌ ఖాన్‌.. తాను మళ్లీ తిరిగి పాల్గొనే వరకూ వేరే వాళ్లకు బిగ్‌బాస్‌-14 హోస్ట్ బాధ్యతలను అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి.

తమిళ నటుడికి క్యాన్సర్, ఆర్థికంగా ఆదుకోవాలంటూ ట్విట్టర్‌లో వేడుకున్న కమెడియన్ తవసి, తోచినంత సాయం చేస్తామని స్పందిస్తున్న నెటిజన్లు

ఈ ఏడాది మార్చిలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సందరర్భంలో సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పాన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో తనను తాను నిర్బంధించుకున్నాడు. ఈ నటుడు తన కుటుంబ సభ్యులు ,స్నేహితులతో ఫామ్‌హౌస్‌లో సరదాగా గడపడమే కాకుండా, వ్యవసాయం కూడా చేశాడు. దీనిలో భాగంగా అతను ఫామ్‌హౌస్ నుండి కరోనావైరస్ అవగాహన వీడియోలను కూడా విడుదల చేశాడు.



సంబంధిత వార్తలు

Salman Khan Firing Case: స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్, పోలీస్ క‌స్ట‌డీలోనే ఉరేసుకొని చ‌నిపోయిన నిందితుడు

Salman Khan Death Threat: ఇదే ఫ‌స్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్! సల్మాన్ ఇంటి ముందు కాల్పులకు పాల్ప‌డింది మేమే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌ట‌న‌, ఈ సారి మిస్ అవ్వ‌దంటూ హెచ్చ‌రిక‌

Tamanna Simhadri : పవన్ కళ్యాణ్‌పై పోటీకి పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి

YouTuber Shanmukh: అన్న కోసం వెళ్తే గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

Pallavi Prashanth Bailed: ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బెయిల్ మంజూరు, ఆదివారం పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశం

Bigg Boss 7 Winner Pallavi Prashanth Arrested: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..బస్సులు, వాహనాల విధ్వంసం కేసులో అరెస్టు చేసిన పోలీసులు

Case Booked Against Pallavi Prashanth: ఫోన్ స్విచ్ఛాఫ్, పరారీలో బిగ్‌బాస్‌ సీజన్‌–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth: బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తిన పల్లవి ప్రశాంత్...రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్..3వ స్థానంలో శివాజీ..