Salman Vs Vicky Kaushal: కత్రినా కైఫ్ భర్తను పక్కకు తోసేసిన సల్మాన్ బాడీగార్డ్స్, ఐఫా వేడుకల్లో ఎదురుపడ్డ సల్మాన్- విక్కీ, మాట్లాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన సల్మాన్! వీడియో ఇదుగోండి!
ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు.
Abu Dhabi, May 26: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న IIFA 2023 అవార్డ్స్ కి హాజరయ్యాడు. ఆ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేశారు. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal కూడా పాల్గొన్నాడు. అయితే విక్కీ కౌశల్ కి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. URI సినిమాలో నటించిన విక్కీ కౌశల్.. ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కత్రినా కైఫ్ ని బాలీవుడ్ లో పరిచయం చేయడమే కాకుండా తనకి స్టార్ స్టేటస్ ని తీసుకు వచ్చింది సల్మాన్ ఖానే. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా జరిగిందని అప్పటిలో వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు IIFA అవార్డ్స్ లో పాల్గొన్న విక్కీ కౌశల్ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు.
కౌశల్ సీరియస్ అవ్వకుండా సల్మాన్ తో (Salman Khan) హ్యాండ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ సల్మాన్ తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు కనీసం సరిగా మాట్లాడాను లేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ వీడియో చూసిన నెటిజెన్స్ సల్మాన్ అండ్ అతడి బాడీ గార్డ్స్ నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సల్మాన్ కి ఇటీవల గ్యాంగ్ స్టార్ నుంచి బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో.. తన సెక్యూరిటీని ఇంకొంచెం మెరుగు పరుచుకున్న సంగతి తెలిసిందే.