Shaakunthalam Dealy: సమంత తొలి పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం.. సీజీ వర్క్ కారణంగానే లేట్.. వెల్లడించిన ‘శాకుంతలం’ నిర్మాత

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. దీని కారణంగానే సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు నిర్మాత తెలిపారు.

Samantha in Shaakunthalam (Image Credits: Twitter)

Hyderabad, August 3: టాప్ హీరోయిన్ అనుష్కతో రుద్రమదేవిని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ తన కలల ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో ఉన్నారు. అగ్ర కథానాయిక సమంత హీరోయిన్ గా  పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ను ఆయన రూపొందిస్తున్నారు. స్యామ్ కు ఇదే తొలి పౌరాణిక చిత్రం. మహాభారతం ద్వితీయ పర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయ ఘట్టాన్ని గుణశేఖర్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. దీని కారణంగానే సినిమా మరింత ఆలస్యమయ్యే  అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత నీలిమా గుణ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపారు. అన్ని కుదిరితే, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రవితేజ కొత్త సినిమాలో అనుపమ్‌ ఖేర్‌.. మాస్ మహారాజా తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.. సినిమా కోసం 7 కోట్లతో భారీ సెట్..

ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యువ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు మోహన్ బాబు దుర్వాస మహాముని పాత్రను పోషిస్తున్నారు.