Hyderabad, August 3: బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. ఆయనకు ఇది 528వ సినిమా. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టువర్ట్‌పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా 1970 బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దుల్కర్ కోసం అఖిల్ స్పెషల్ హలీమ్.. ప్రతీ రంజాన్ కు మిస్ అవకుండా..
వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానున్నది. రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిదే. ఈ సినిమా కోసం రూ. 7 కోట్లతో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేశారు.