Twist in Raj Tarun Case: ‘అసలు అత‌డు మ‌గాడే కాదు’.. రాజ్ తరుణ్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యువ‌తి.. వీడియో ఇదిగో

తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావ‌ణ్య అనే యువ‌తి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

Samyukta (Credits: X)

Hyderabad, Aug 19: హీరో రాజ్ తరుణ్ (Hero Raj Tarun) కు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావ‌ణ్య (Raj Tarun-Lawanya Case) అనే యువ‌తి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగానే.. రాజ్ తరుణ్ పై సంయుక్త అనే మ‌రో యువతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అతని పేరు ప్ర‌స్తావించ‌కుండా అత‌డి సినిమాల‌తో ఆ హీరో మ‌గాడే కాదంటూ వీడియో పెట్టింది. అయితే సంయుక్త అనే పేరుతో మాట్లాడిన అమ్మాయి ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ అడ్డం పెట్టుకుంది. దీంతో.. ప్ర‌మోష‌న్స్ కోసం, చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వీడియోలు చేసిన‌ట్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా, రాజ్ త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘భ‌లే ఉన్నాడే..’  సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే ఈ వీడియో చేసిన‌ట్లు ఇంకొందరు చెప్తున్నారు.

బాలయ్య ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు హాజరుకానున్న మెగాస్టార్

వీడియోలో సంయుక్త ఏమన్నదంటే?

‘గ‌త నెల నుంచి రాజ్ త‌రుణ్ – లావ‌ణ్య మ‌ధ్య జ‌రుగుతున్న ర‌చ్చ చూస్తున్నా. అయితే ఆ హీరో చూడడానికి బాగుంటాడు కానీ అతనికి మ్యాటర్ లేదట. ఒక మ్యాట‌ర్ లేని వ్య‌క్తి ఇలాంటివి అన్ని చేశాడు అంటే న‌మ్మ‌బుద్ది కాట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్‌ తో త‌ను రిలేష‌న్ షిప్‌ లో ఉన్నాడు. అయితే వాళ్లిద్ద‌రు రిలేష‌న్‌ లో ఉన్న‌ప్పుడు ఆ పిల్ల రోజు ఏడుస్తునే ఉండేది. ఎందుకు ఎడుస్తున్నావు అంటే నన్ను ఎప్పుడు దూరం ఉంచుతున్నాడు అని చెప్పింది. అందుకే చెబుతున్నా రాజ్ త‌రుణ్ సినిమాలో మాత్ర‌మే హీరో బ‌య‌ట జీరో. నమ్మట్లేడా? ఏది ఏమైనా స‌రే ఆగ‌ష్టు 19 నా ఫ్రెండ్ ఇండియాకు వ‌స్తుంది. అప్పుడు సాక్ష్యాలతో మీ ముందుకు వ‌స్తా’  అంటూ సంయుక్త వీడియోలో తెలిపింది.

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2, కన్నడ బెస్ట్ మూవీగా కేజీఎఫ్‌-2..పూర్తి వివరాలివే