Sandalwood Drug Case: కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, నటి సంజన ఇంట్లో పోలీసులు సోదాలు, కేసులో విచారణను వేగవంతం చేసిన బెంగుళూరు సీసీబీ

శాండ‌ల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిగాయి. తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు (Actress Sanjana galrani's residence) నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు.

Bengaluru CCB raid on Actress Sanjana galrani's residence (Photo-ANI)

కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం (Sandalwood Drug Case) సృష్టిస్తోంది. శాండ‌ల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిగాయి. తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు (Actress Sanjana galrani's residence) నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల‌లో కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైతే సంజ‌న‌ని (Sanjana Galrani) అరెస్ట్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఇంక ఈమె ద్వారా డ్ర‌గ్స్ ఉచ్చులో ఇంకెంత‌మంది చిక్కుకున్నార‌నే విష‌యాన్ని రాబ‌ట్ట‌నున్నారు. తాజాగా ఈ కేసులో డిజైనర్ నియాజ్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవ‌ల ప‌ట్టుబ‌డ్డ ఓ డ్ర‌గ్స్ ముఠా నుండి సీసీబీ పోలీసులు (Bengaluru CCB) కీల‌క స‌మాచారం రాబ‌డుతుండ‌గా, ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే న‌టి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న విషయంపై సీసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు, కొంతమందిని అరెస్ట్ చేశారు.

Updated by ANI

ఇక మరోవైపు ఈ కేసులో తాజాగా డిజైనర్ మోడల్ నియాజ్‌ని సీసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. కేరళకి చెందిన నియాజ్, నటి రాగిణితో పాటు పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. నియాజ్‌ పలు మలయాళ సినిమాల్లో నటించగా.. మాలీవుడ్‌లో డ్రగ్స్ సరఫరాపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. కాగా నటి రాగిణిని ఐదు రోజులు పోలీసుల విచారణకు ఎసిసిఎం కోర్టు అనుమతిని ఇచ్చింది.

ట్విస్టులతో సాగుతున్న సుశాంత్ డెత్ కేసు, రియా చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు, విచారణకు హాజరకావాలని ఆదేశించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా 12 మందిపై సిసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంజనకు డ్రగ్స్ సప్లయిర్స్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.సంజన మిత్రుడిని సీసీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. సంజనను సీసీబీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకుని వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గత రెండు మూడు నెలలుగా సంజన, రాగిణి ద్వివేదిలను కలిసినవారిని కూడా సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించవచ్చునని అంటున్నారు. డ్రగ్స్ కేసు చుట్టుముట్టుడుతున్న క్రమంలో కొంత మంది బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. ...



సంబంధిత వార్తలు

Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్ట‌కేల‌కు ఆ స్టార్ క‌పుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చ‌ట్ట‌ప‌రంగా తెర

Nara Lokesh Key Comments: ఏపీలో ఇక‌పై వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్, కేబినెట్ స‌బ్ క‌మిటీలో కీల‌క నిర్ణ‌యం, ప్ర‌తిపాదించిన నారా లోకేష్

Raghu Rama Krishna Raju Harassment Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు