Sarkaru Vaari Paata Shoot Begins: సర్కారి వారి పాట షూటింగ్ దుబాయ్‌లో, ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్

దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైందంటూ సోషల్‌ మీడియా వేదికగా చిత్రయూనిట్ ప్రకటించింది.

Mahesh Babu and Keerthy Suresh in Sarkaru Vaari Paata (Photo Credits: Twitter)

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు తాజాగా నటిస్తున్న‘సర్కారు వారి పాట’ షూటింగ్ (Sarkaru Vaari Paata Shoot Begins) మొదలైంది. దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైందంటూ సోషల్‌ మీడియా వేదికగా చిత్రయూనిట్ ప్రకటించింది. ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ‘సర్కారు వారి పాట’ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబును డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.

Here's Movie Update

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాట్లాడుతూ.. ‘స‌ర్కారు వారి పాట రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు. బ్యాంకింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్‌ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌ (Mahesh Babu And Keerthy Suresh) మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు.

ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif