Sonu Sood: నిసర్గ తుఫాన్ కల్లోలం, 28 వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కోట్లు ఖర్చు పెట్టిన సోనూ భాయ్

వలస కార్మికుల దగ్గర నుంచి నిన్న నిసర్గ తుఫాన్ వరకు ఆయన (Sonu Sood) చేసిన సాయం ఎనలేనిది. లాక్‌డౌన్‌ (Lockdown) కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ (Cyclone Nisarga) ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

Sonu Sood (Photo Credits: Instagram)

Mumbai, June 5: సోనూసూద్‌..ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. వలస కార్మికుల దగ్గర నుంచి నిన్న నిసర్గ తుఫాన్ వరకు ఆయన (Sonu Sood) చేసిన సాయం ఎనలేనిది. లాక్‌డౌన్‌ (Lockdown) కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ (Cyclone Nisarga) ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వర్మ 'కరోనా వైరస్‌' ట్రైలర్, జగన్,కేసీఆర్‌ పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ ట్రైలర్‌కి హైలైట్‌, యూట్యూబ్‌లో ట్రెండింగ్ ఇదే

సోనూసూద్‌ పీటీఐతో మాట్లాడుతూ... ‘‘ఈరోజు మనమంతా చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఒకరికొరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో నేను, నా బృందం తీర ప్రాంతాల్లోని దాదాపు 28 వేల మందికి ఆహారం అందించాం. వారిని సమీపంలోని స్కూళ్లు, కాలేజీలు తదితర పునరావాస కేంద్రాలకు తరలించాం. వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం’’అని చెప్పుకొచ్చారు.

అదే విధంగా నిసర్గ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కార్మికులను షెల్టర్‌ హోంకు తరలించినట్లు వెల్లడించారు. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో చొరవ చూపిన సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోనూసూద్‌ సాయం పొందిన వారు ఆయనను దేవుడిగా అభివర్ణిస్తున్నారు. అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే.

ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వ‌ద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే కొన్ని గంటల్లోనే తుపాను ప్రభావం తగ్గిపోవడంతో ముంబై వాసులు ఊపిరిపీల్చుకున్నారు



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif