SS-Rajamouli-Earthquake: భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్న దర్శకధీరుడు రాజమౌళి, 28వ ఫ్లోర్ లో ఉండగా ఒక్కసారిగా కంపించిన భూమి, జక్కన్న ఫ్యామిలీ మొత్తానికి తప్పిన ముప్పు, వైరల్ గా మారిన కార్తికేయ ట్వీట్
కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం (earthquake ) ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన పేర్కొన్నాడు.
Tokyo, March 21: ఇండియన్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కుటుంబం మొత్తం జపాన్‌లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం (earthquake ) వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ (Karthikeya) తన ఎక్స్ పేజీలో తెలిపాడు. ఈ మేరకు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి అభిమానులను షాక్‌కు గురి చేసింది. జపాన్‌లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్‌లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని ఆయన చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం (earthquake ) ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన పేర్కొన్నాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు.
దీనితో నెటిజన్స్ రాజమౌళి అండ్ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ ఇండియాకి తిరిగి రావాలని కార్తికేయ పోస్ట్‌లో తెలియజేస్తున్నారు. దీని తీవ్రత 5.3గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో 46 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. కానీ ప్రాణనష్టం గురించి ఎలాంటి వివరాలను జపాన్ ప్రకటించ లేదు.
ఈ ఏడాది ప్రారంభంలో కూడా నూతన సంవత్సరాది వేళ అందరూ సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో జపాన్‌ను భారీ భూకంపం కుదిపివేసింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలు వణికిపోయాయి. సుమారు 60 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో రాజమౌళి కూడా రియాక్ట్ అయ్యారు. తమ హృదయాల్లో జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పిన ఆయన భూకంపం బారిన పడిన ప్రతి ఒక్కరికీ సానుభూతి ప్రకటించారు.