Jai Bheem Tops In Google Trends: జైభీమ్ సినిమాకు అరుదైన గౌరవం, 2021 గూగుల్ ట్రెండ్స్ లో టాప్ సెర్చింగ్ సినిమాగా గుర్తింపు, బాలివుడ్ ను దాటేసిన సూర్య మ్యాజిక్..

సినిమా కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ (Jai Bhim) సినిమా గురించే వెతికారట.

Suriya Jai Bhim Tops Google Trends in 2021 (Image: WIKIPEDIA)

న్యూఢిల్లీ, డిసెంబర్ 09: 2021లో భారతీయులు గూగుల్‌ (Google Trends 2021)లో ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో క్రీడలు మొదటిస్థానంలో నిలవగా కరోనా రెండోస్థానంలో నిలిచింది. సినిమాలు మూడోస్థానంలో నిలిచాయి. వీటిలో అత్యధికంగా జై భీమ్‌(Jai Bhim) సినిమా కోసం సెర్చ్‌ చేసినట్లు సమాచారం. సినిమా కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ (Jai Bhim) సినిమా గురించే వెతికారట. దళిత కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. ఇందులో సూర్య లాయర్‌గా నటించారు. జై భీమ్‌ (Jai Bhim) తర్వాత ఎక్కువగా సిద్ధార్‌ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నంటించిన షేర్షా సినిమా గురించి వెతికారు. కార్గిల్‌ యుద్ధంలో పనిచేసిన ఇండియన్‌ ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1. జై భీమ్‌ 2. షేర్షా 3. రాధే 4. బెల్‌బాటమ్‌ 5. ఎటర్నల్స్‌ 6. మాస్టర్‌ 7. సూర్యవంశీ 8. గాడ్జిల్లా vs కాంగ్‌ 9. దృశ్యం 2 10. భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా సినిమాలు నిలిచాయి.

ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..అయితే ఈ పెరిగిన ఛార్జీలు గురించి ఓ సారి తెలుసుకోండి, లేకుంటే వసూళ్ల బాదుడు తప్పదు

ఆసక్తికరంగా, జై భీమ్,(Jai Bhim) షేర్షా, రాధే, బెల్ బాటమ్, దృశ్యం 2 మరియు భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా వంటి డైరెక్ట్ OTT విడుదలలు 2021లో విడుదలైన థియేట్రికల్ చిత్రాలతో పోలిస్తే అత్యధికంగా శోధించబడిన చిత్రాలు. తమిళ్‌తో పాటు, జై భీమ్‌ని భారతదేశంలోని తమిళేతర మాట్లాడే ప్రేక్షకులు కూడా శోధించారని మరియు ఫలితంగా, ఇది Google ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ఉందని డేటా సూచిస్తుంది. డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ ఖచ్చితంగా సూర్య నటించిన చిత్రానికి సహాయపడింది మరియు ఈ చిత్రం తమిళ సినిమాకు సాధారణ సరిహద్దును దాటి ప్రయాణించింది.