Tamannaah Bhatia: మెటిమలు, మచ్చలు పోవాలంటే దానిపై ఉమ్మి రాయండి, సంచలన ట్రిక్ చెప్పిన మిల్క్ బ్యూటీ తమన్నా, తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా వాడతానని తెలిపిన తమన్నా భాటియా

ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే ఉమ్మిని వాటిపై అప్లై చేస్తే ఇట్టే మాయమవుతాయట.. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. మిల్క్ బ్యూటీ తమ్మన్నా (Tamannaah Bhatia).. వినడానికి ఆశ్చర్యంగా ఇది స్వయంగా ఆమె వాడుతోందట..

Tamannaah Bhatia (Photo Credits: Twitter)

ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే ఉమ్మిని వాటిపై అప్లై చేస్తే ఇట్టే మాయమవుతాయట.. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. మిల్క్ బ్యూటీ తమ్మన్నా (Tamannaah Bhatia).. వినడానికి ఆశ్చర్యంగా ఇది స్వయంగా ఆమె వాడుతోందట.. చాలామంది ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. సినిమా హీరోయిన్స్‌ అయితే ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు అయితే ఇవేమి అవసరం లేదని కేవలం మీ ఉమ్మి ద్వారానే వాటిని తగ్గించుకోవచ్చని బాహుబలి అవంతిక ఓ మ్యాగజౌన్ ఇంటర్యూలో తెలిపింది.

ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను (morning saliva) కూడా వాడతానని చెప్పింది. ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని తెలిపింది.ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో అనే సినిమాలోను నటిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement