Delhi Ganesh Passes Away: ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన గణేశ్, సినీ ప్రముఖల సంతాపం
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Hyd, Nov 10: తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400కిపైగా సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేశ్. ఆయన నటించిన చివరి చిత్రం భారతీయుడు 2. తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు తదితర హిట్ చిత్రాల్లో నటించారు.
తమిళనాడులోని తిరునెల్వెలిలో జన్మించారు ఢిల్లీ గణేశ్. ఆయన అసలు పేరు గణేశన్. 1976లో కే.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. బాలయ్య షోలో మరోసారి పుష్పరాజ్, ఈ సారి ఈ ఇద్దరి రచ్చ మామూలుగా లేదుగా! అన్ స్టాపబుల్ షోలో ఐకాన్ స్టార్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళంలో పనిచేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగం వదిలి చిత్ర పరిశ్రమకే పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించారు . 1979లో తమిళనాడు స్టేట్ అవార్డు, 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు ఢిల్లీ గణేశ్ అనే పేరు పెట్టింది కే. బాలచందర్.