Shankar Daughter Aishwarya Engaged: డైరక్ట‌ర్ శంక‌ర్ కూతురికి రెండో పెళ్లి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఎంగేజ్ మెంట్ ఫోటోలు, ఇంత‌కీ శంక‌ర్ కు కాబోయే అల్లుడు ఎవ‌రంటే?

అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్‌మెంట్‌ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా.

Shankar Daughter Aishwarya Engaged (PIC@ X)

Chennai, FEB 18: ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ (Shankar daughter) కూతురు మళ్లీ పెండ్లిపీటలు ఎక్కబోతున్నది. మొదటి భర్తతో విడిపోయిన శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్య.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తికేయన్‌తో (Tarun karthikeyan) రెండో వివాహానికి సిద్ధమయ్యింది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని శంకర్‌ రెండో కూతురు అదితి శంకర్‌ (adithi shankar) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అలాగే ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది. శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్య 2021లో క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌ను పెండ్లి చేసుకుంది. కానీ కొద్ది నెలలకే వారి మధ్య విబేధాలు వచ్చాయి.

 

పైగా రోహిత్‌ దామోదరన్‌ నిర్వహిస్తున్న క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదులు రావడంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. దీంతో రోహిత్‌ నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్‌మెంట్‌ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif