Tollywood: అదిరింది.. మల్టీఫ్లెక్స్‌లో సినిమా టికెట్ ధర ఇకపై రూ.125, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 మాత్రమే, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం

మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (Telugu Film Producers Council) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు.

Tollywood Logo

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (Telugu Film Producers Council) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని ఆలోచన చేసింది. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి తెలుగు చిత్ర సీమలో ఉన్న సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానించింది. దీంతో పాటుగా ఓటీటీ రిలీజ్‌లపైనా (OTT releases) కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలను పది వారాల తర్వాతే ఓటీటీలో (OTT) రిలీజ్‌ చేయాలని నిర్ణయించింది.

పరిమిత బడ్జెట్‌లో తీసిన చిత్రాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి చెప్పింది. అలాగే రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల ఓటీటీ రిలీజ్‌ విషయంపై ఫెడరేషన్‌తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఓటీటీలో కొత్త సినిమాలు, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాలపై సుమారు గంటపాటు చర్చించిన అనంతరం.. సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయించింది.

అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా?, రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫోటోలపై స్పందించిన వర్మ

సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 రూపాయలు ఉండేలా ప్రతిపాదనలు ముందు పెట్టింది. మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేసింది. ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని సూచించింది. ఫిలిం చాంబర్ నిర్ణయించిన రేట్ కార్డ్ నే షూటింగ్ ప్రదేశాల్లో నిర్మాతలు అమలు చేయాలని ఆదేశించింది.

నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థను తొలగించాలని మండిపడింది. నిర్ణీత సమయానికల్లా నటీనటులు షూటింగ్స్‌కు హాజరయ్యేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. నిర్దేశించిన సమయానికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని తెలిపింది. నటీనటుల సహాయకులకు వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పారితోషకంలో కోత విధించాల్సిందేనని పేర్కొంది.

షూటింగ్స్‌ బంద్‌తో ఈ సినిమాలకు కష్టాలే

1.బాబీ - చిరంజీవి సినిమా

2.గాడ్‌ ఫాదర్‌

3. మెహర్‌ రమేశ్‌- చిరంజీవి

4.గోపీచంద్‌ మలినేని- బాలకృష్ణ (NBK107)

5.హరిహర వీరమల్లు

6.శంకర్‌- రామ్‌చరణ్‌ (RC15)

7.వంశీ పైడిపల్లి- విజయ్‌

8.ఖుషీ

9.యశోద

10. ఏజెంట్‌

ఇవి కాకుండా పుష్ప2, భవదీయుడు భగత్‌ సింగ్‌, త్రివిక్రమ్‌- మహేశ్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ, కొరటాల శివ- తారక్‌ కాంబినేషన్‌లోని భారీ చిత్రాలు సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా తాజా నిర్ణయంతో వాటికి ఆదిలోనే ఆటంకం ఏర్పడినట్లయింది.