ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేసిన సంగతి విదితమే. దీనిపై ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్‌వీర్‌గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్‌వీర్‌ ఇలా ఫోటో షూట్‌ చేసి ఉండోచ్చని అభిప్రాయపడ్డాడు. మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది.. పురుషులు ఎందుకు అలా చూపించొద్దని ప్రశ్నించాడు. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా.. మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్‌ క్వశ్చన్‌ కూడా పెట్టాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)