Chiranjeevi Tests Positive for Covid: హీరో చిరంజీవికి కరోనా, సీఎం కేసీఆర్‌ని కలిసిన రెండు రోజుల తర్వాత పాజిటివ్, హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన మెగాస్టార్

ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా (Chiranjeevi Tests Positive for Covid) నిర్ధారణ అయిది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విటర్‌ వేదికగా తెలిపారు.

chiranjeevi-new-look-leaked-from-koratala-siva-movie-and-it-goes-viral-in-social-media (Photo-Social media)

తెలుగు సినిమా ఎవర్ గ్రీన్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి కరోనావైరస్ బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా (Chiranjeevi Tests Positive for Covid) నిర్ధారణ అయిది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విటర్‌ వేదికగా తెలిపారు.

ఆచార్య షూటింగ్ (Acharya) ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. నాకు (Telugu Hero Chiranjeevi) ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’అని చిరంజీవి పేర్కొన్నారు.

అయితే చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబుకు కూడా ఆ మధ్యన కరోనా సోకగా.. ఆయన కోలుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున ఇద్దరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి నుంచి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా.. చిరుకు కరోనాతో మళ్లీ వాయిదా పడింది.

Here's ChiruTweet

కాగా, మూడు రోజుల క్రితం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. ఆయన వెంట హీరో నాగార్జున కూడా ఉన్నారు. నిన్న (ఆదివారం) టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif