Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఎక్కడున్నా తమ ముందుకు రావాల్సిందేనని హీరోకు పోలీసుల నోటీసు

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది.

Lavanya filed a police complaint against hero Raj Tarun

Hyderabad, July 16: గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది. రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య (Lavanya) అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజ్ తరుణ్ కు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరుకు రాజ్ తరుణ్ పై ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల విషయమై హీరో రాజ్ తరుణ్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..

జూలై 18 డెడ్ లైన్

జూలై 18 లోపల పోలీసుల ఎదుట హాజరు అవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు నోటీసులు ఇవ్వడం అంతట చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif