The Kerala Story OTT Release Date: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే??

థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.

Kerala Story (Credits: Twitter)

Newdelhi, May 9: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ (The Kerala Story) మూవీ ఓటీటీలోకి (OTT) వచ్చేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ డిజిటల్ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE 5) కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ (Two Months Gap) తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. లవ్ జిహాద్ కాన్సెప్ట్‌ తో ఈ  సినిమాను  తెరకెక్కించారు.

TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం

కలెక్షన్ల దూకుడు

అనేక ఆందోళనల నడుమ ఇటీవల రిలీజైన ఈ మూవీ ఇండియా వైడ్‌గా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్నది. మరోవైపు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ మూవీని బ్యాన్ చేయాలని కొన్ని సంఘాలు పట్టుపడుతోన్నాయి. వెస్ట్ బెంగాళ్‌లో ఈ సినిమాను నిషేదించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ సినిమాను నిషేధించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుద‌ల‌.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?