hang (photo-Pixabay)

హత్య కేసులో యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.కేరళ రాష్ట్రంలోని కన్నూర్ కు చెందిన మహ్మద్ రినాష్, పీవీ మురళీధరన్ లకు మరణశిక్ష (Two Kerala Men Executed in UAE)అమలు చేసిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు.

ట్రావెల్ ఏజెన్సీ ఏఐ ఎయిన్ లో పని చేసిన రినాష్ అక్కడ ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన నేరం కింద మరణశిక్ష అమలు చేయగా,. మురళీధరన్ అనే వ్యక్తి భారత్ కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మరణశిక్షను అమలు చేశారు.వీరి హత్య కేసులో భాగంగా కావాల్సిన అన్ని న్యాయపరమైన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

అయితే వారిపై ఉన్నవి హత్యానేరాలు కావడంతో మరణశిక్ష అమలు తప్పలేదని, వారి చివరి మజిలీలో భాగంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరి చొప్పున అక్కడికి వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్లు విదేశాంగ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీనే వీరికి మరణశిక్షను ఖరారు చేయగా, తాజాగా వారి శిక్షను అమలు చేశారు. ఇప్పటిరవకూ భారత్ కు చెందిన 28 మంది యూఏఈలో మరణశిక్ష బారిన పడ్డారు.

గత నెలలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళకు యుఎఇలో ఉరిశిక్ష అమలు చేయబడింది. డిసెంబర్ 2022లో తన సంరక్షణలో ఉన్న నాలుగు నెలల చిన్నారిని చంపాడనే ఆరోపణలపై షహజాది ఖాన్‌ను ఫిబ్రవరి 15న అబుదాబిలో ఉరితీశారు. సాధారణ టీకాలు వేసిన తర్వాత ఆ చిన్నారి మరణించింది. సంరక్షకుడిగా పనిచేస్తున్న షహజాది మరణానికి కారణమయ్యాడని ఆరోపణలు వచ్చాయి.

ఆ మహిళ తండ్రి ఇటీవల భారత ప్రభుత్వానికి తన అంత్యక్రియల కోసం తనను యుఎఇకి పంపాలని విజ్ఞప్తి చేశారు. "ఆమె అంత్యక్రియలకు హాజరు కావడానికి ప్రభుత్వం నన్ను దుబాయ్ వెళ్లేందుకు ఒక ట్రిప్ ఏర్పాటు చేయాలి. నాకు అన్యాయం జరిగింది. మీరు నా కూతురిని నాకు ప్రాణాలతో ఇవ్వలేకపోయారు, కనీసం ఆమె మృతదేహాన్ని కూడా ఇవ్వలేకపోయారు" అని షబ్బీర్ ఖాన్ ఇండియా టుడేతో అన్నారు.