Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు, పూరీ జగన్నాథ్, చార్మీ, తరుణ్, నవదీప్ తదితరులపై నమోదు కేసిన ఆరు కేసులు కొట్టివేత
2017లో నమోదైన ఎనిమిది కేసుల్లో 6 కేసులను (Nampally court dismissed Six cases) నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drugs Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 2017లో నమోదైన ఎనిమిది కేసుల్లో 6 కేసులను (Nampally court dismissed Six cases) నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్ , ఎనిమిది కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వాటిలో ఆరు కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్, చార్మీ, తరుణ్, నవదీప్, రవితేజ, శ్యామ్ కె నాయుడు, ముమైత్ ఖాన్, తనీష్ సహా పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది.డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవారిని నెలల తరబడి వారిని విచారించినా ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు, గోళ్లను శాంపిల్ తీసుకున్నారు. కానీ కేవలం పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది.ఈ నివేదిక ఆధారంగా రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది.