Actress Pori Moni: ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్ హీరోయిన్ పోరి మోని, నిందితుడు నజీర్ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించాలంటూ దేశ ప్రధాని షేక్ హసీనాను ఆమె సోషల్ మీడియాలో కోరింది.
Dhaka, June 15: పేరు మోసిన వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ హీరోయిన్ పోరి మోని(షామ్‌సున్నాహర్) (Bangladeshi actress Shamsunnahar Smriti) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించాలంటూ దేశ ప్రధాని షేక్ హసీనాను ఆమె పోస్ట్ ద్వారా కోరింది.
ప్రధానిని తల్లిగా సంబోధించిన మోని నిందితులపై చర్యలు తీసుకోమని అర్థించింది. "నేను న్యాయం కోసం ఎక్కడని వెతకాలి? నాలుగు రోజులుగా నేను న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను అమ్మాయిని, పైగా నటిని. వీటన్నింటికన్నా ముందు నేనూ ఒక మనిషినే. ఇక నేను (Pori Moni) సైలెంట్‌గా ఉండలేను" అని పోస్టులో తన ఆవేదనను వ్యక్తం చేసింది.
నాలుగు రోజుల క్రితం ఓ క్లబ్‌లో వ్యాపారవేత్త నజీర్ యు మహ్మూద్ (businessman Nasiruddin Mahmud) తనపై అత్యాచారానికి యత్నించడంతో పాటు చంపుతామని బెదిరించాడని నటి మోని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Here's IANS Tweet
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వ్యాపారవేత్తతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో వారు మద్యంతో పాటు డ్రగ్స్ సేవించారని అధికారులు మీడియాకు తెలిపారు. ఇదిలా వుంటే పోరి మోని 2015లో వెండితెరకు పరిచయమైంది. సుమారు 24 బంగ్లాదేశీ చిత్రాల్లో కథానాయికగా అలరించింది. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన '100 డిజిటల్ స్టార్స్ ఆఫ్ ఆసియా' జాబితాలో చోటు దక్కించుకుంది.