Ram Pothineni On Trolls: బోయపాటిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్, ఘాటుగా స్పందించిన హీరో రామ్, అవును బోయపాటి డూప్‌గా చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసా? అంటూ ఫోటో పెట్టిన రామ్

శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఫుల్ మాస్, యాక్షన్ తో ఉండటంతో సినిమా కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది. తాజాగా స్కంద సినిమా నవంబర్ 2 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.

Ram Pothineni On Trolls (PIC@ RAM X)

Hyderabad, NOV 04: బోయపాటి(Boyapati) దర్శకత్వంలో రామ్ ఊర మాస్ గా మారి వచ్చిన సినిమా స్కంద(Skanda). శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఫుల్ మాస్, యాక్షన్ తో ఉండటంతో సినిమా కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది. తాజాగా స్కంద సినిమా నవంబర్ 2 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది. అయితే ఓటీటీలో ఈ సినిమాని చూసిన వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి (RAM) బదులు డైరెక్టర్ బోయపాటి (Boyapati) చేసినట్టు కనిపెట్టారు. సినిమాలో బోయపాటి ఉన్న షాట్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పలువురు దీనిపై ట్రోల్స్, మీమ్స్ వేశారు. ఎడిటింగ్ లో చూసుకోలేదా, రామ్ కి డూప్ గా (Boyapati Trolls) నటించారా? మేకింగ్ వీడియోని ఇందులో కలిపారా అని ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా బోయపాటిపై వస్తున్న ట్రోల్స్ కి రామ్ గట్టిగానే స్పందించాడు.

ఓ మీడియా సంస్థ బోయపాటి షాట్ ని పోస్ట్ చేయగా దానికి సమాధానంగా రామ్.. 2023 సమ్మర్ ఏప్రిల్ 22న ఆ షూటింగ్ జరిగింది. ఫుల్ సమ్మర్ లో జరిగిన షూట్ నాకింకా గుర్తు ఉంది. ఎండలో చెప్పులు లేకుండా ఫైట్ చేసే సీన్ అది. అప్పటికే మూడు రోజులు కష్టపడ్డాను. సరిగ్గా నడవలేకపోయాను కూడా. రక్తం రావడంతో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను.

 

మా డైరెక్టర్ అంతలో ఆ షూట్ తానే నటించి పూర్తి చేశారు. సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది పూర్తిగా ఆడియన్స్ ఇష్టం. నేను మీ అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇదంతా నేను మీ కోసమే చేస్తున్నాను. ఆ ఒక్క షాట్ మా డైరెక్టర్ నా కోసం చేశారు. నేను మాత్రం మిమ్మల్ని అలరించడానికి నా రక్తం, చెమటను ధారపోస్తాను అని ట్వీట్ చేస్తూ తన అరికాలికి అయిన గాయాలు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేశాడు. దీంతో రామ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్