World Famous Lover Teaser: ప్రేమంటే కాంప్రమైజ్ కాదు, ప్రేమంటే సాక్రిఫైజ్! విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ ఔట్, అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ కంటిన్యూ, కానీ విజయ్ క్యారెక్టర్‌లో డిఫెరెంట్ షేడ్స్

ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అనిపిస్తుంది. టీజర్లో ఒకచోట "I did not just spread your legs, Yamini. I loved you, Yamini.” (యామిని...నేను నీ కాళ్లను ఇరువైపులా చాచడం మాత్రమే చేయలేదు, నిన్ను ప్రేమించాను కూడా) అనే డైలాగ్ ఉంది. ఫిజికల్ గా నీతో కలవడమే కాదు, మనసుతో ప్రేమించాను కూడా...

World Famous Lover Teaser | (Photo Credits: Creative Commercials)

రౌడీ స్టార్- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' (World Famous Lover) టీజర్ తో వచ్చేశాడు. 'ప్రేమంటే కాంప్రమైజ్ కాదు, ప్రేమంటే సాక్రిఫైజ్' ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవేవి నీకర్థం కావు' అని రాశి హీరోయిన్ ఖన్నా వాయిస్ బ్యాక్ ప్లే అవుతుండగా, విజయ్ రొమాంటిక్ లుక్స్ తో అమ్మాయిలను చూస్తుండే ఫ్రేమ్స్ అలా వెళ్తుంటాయి. ఇలా టీజర్ ప్రారంభమైంది. దీనిని బట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా మరో బోల్డ్, ఇంటెన్స్ లవ్ స్టోరీ అని, ప్రేమకు నిజమైన అర్థం చెప్పే భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కినట్లు అనిపిస్తుంది. టీజర్ లో కొన్ని సన్నివేశాలను చూస్తే 'అర్జున్ రెడ్డి' సినిమాను గుర్తుకు తెస్తుంది. కోపంగా అరవడం, బాటిల్స్ పగలగొట్టం, విజయ్ లుక్స్ పరంగా చూస్తే అర్జున్ రెడ్డి పార్ట్-2 అన్నట్లు అనిపిస్తుంది. అయితే విజయ్ దేవరకొండ నటనపరంగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్లో డిఫెరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి.

విజయ్ పక్కన నలుగురు హీరోయిన్లు రాశి ఖన్నా (Raashi Khanna), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కేథరీన్ ట్రెసా (Catherine Tresa) మరియు ఇజబెల్లె లీటీ (Isabelle Leite) నటిస్తున్నారు. అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం రాశి ఖన్నా అనే అర్థమవుతుంది.  వరల్డ్ ఫేమస్ లవర్ యాక్టర్స్ ఇంట్రొడొక్షన్, సినిమా ప్రారంభ విశేషాలు ఇక్కడ చూడొచ్చు

ఈ సినిమాలో విజయ్ ప్లేబాయ్ రోల్ లో, అమ్మాయిలను కేవలం సెక్స్ కోణంలో మాత్రమే చూసే క్యారెక్టర్ చేసినట్లు అర్థమవుతుంది. నలుగురు అమ్మాయిలతో రొమాన్స్, డిఫెరెంట్ కథాంశాలు సినిమాలో ఉండే అవకాశం ఉంది. అయితే విజయ్ మల్టిపుల్ రోల్స్ చేస్తున్నాడా లేదా పునర్జన్మ థీమ్ ఏదైనా ఉందా అనే విషయం సినిమా చూస్తే కానీ తెలియదు. టీజర్ పై ఒకసారి నజర్ వేయండి.

World Famous Lover Teaser :

ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అనిపిస్తుంది. టీజర్లో ఒకచోట "I did not just spread your legs, Yamini. I loved you, Yamini.” (యామిని...నేను నీ కాళ్లను ఇరువైపులా చాచడం మాత్రమే చేయలేదు, నిన్ను ప్రేమించాను కూడా) అనే డైలాగ్ ఉంది. ఫిజికల్‌గా నీతో కలవడమే కాదు, మనసుతో ప్రేమించాను కూడా అనే అర్థం వచ్చేలా డైలాగ్స్ ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ఇలా ఉంది

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పాన్-ఇండియా సెన్సేషన్‌గా, లవర్ బోయ్‌గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చివరిసారిగా 'డియర్ కామ్రెడ్' లో కనిపించి పక్కింటి అబ్బాయిలాగా మంచి నటన చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాతో విజయ్ ఎలాంటి నటన చూపుతాడోనని ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, తమిళ, కన్నడ, మళయాల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. భాష అర్థంకాకపోయినా ఈ టీజర్‌ను చాలా మంది ఇండియా వైడ్ ప్రేక్షకులు షేర్ చేస్తున్నారంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ప్రేమికుల రోజు- ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now