Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా? ఈ మాస్‌ కా దాస్‌ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా?

అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.

Vishwak Sen (Credits: Twitter)

Hyderabad, June 3: యూత్‌ఫుల్‌ (Youthful), లవ్‌ (Love), కమర్షియల్‌ చిత్రాలతో (Commercial Movies) మాస్‌ కా దాస్‌గా (Mass Ka Das) ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. తాను నటించిన ఓ సినిమా దాదాపు రెండేళ్లు వాయిదా పడిందని అందుకే పేరు మార్చుకున్నానని చెప్పారు.

Naatu Naatu in Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట 'నాటు-నాటు' స్టెప్పులేసి దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు

''అనుకోని ఆలస్యం తర్వాత సినిమా విడుదలైతే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నాక్కూడా తెలుసు. నేను నటించిన తొలి చిత్రం 'వెళ్ళిపోమాకే'ను రూ.12 లక్షలు ఖర్చుపెట్టి తెరకెక్కించాం. 'ఇదిగో రిలీజ్‌.. అదిగో రిలీజ్‌' అంటూ సుమారు 24 నెలలపాటు దాన్ని వాయిదా వేశారు. అప్పుడు ఇంట్లో వాళ్లు న్యూమరాలజిస్ట్‌ కు నా జాతకం చూపించారు. దినేశ్‌ నాయుడు అనే పేరుతో ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో గుర్తింపు రాదని.. వీలైతే వెంటనే పేరు మార్చమన్నారు. అంతేగాకుండా నాలుగు పేర్లు కూడా ఆయనే సజెస్ట్‌ చేశారు. అందులోంచి నేను విశ్వక్‌ సేన్‌ను ఎంచుకున్నా” అని చెప్పారు.

Odisha Train Tragedy Update: పట్టాలపై అంతులేని విషాదం.. ఒడిశా రైలు ప్రమాదంలో ఢీకొన్నవి రెండు రైళ్లు కాదు.. మూడు రైళ్లు.. 233కు చేరిన మృతుల సంఖ్య.. మరో 900 మందికి పైగా గాయాలు.. ఇంకా బోగీల్లోనే 600-700 మంది!



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif