Salman Khan on Women Dress Code: స్త్రీలు తమ శరీరాలను దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది, సల్మాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Salman Khan (Photo Credits: Instagram)

స్త్రీల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని వారు దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’లో నటించిన నటి పాలక్‌ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘సల్మాన్‌ తన సినిమా సెట్లో మహిళలందరూ మెడ వరకూ నిండుగా వస్త్రాలు ధరించేలా చూస్తారు’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘ఆప్‌ కీ అదాలత్‌’ వ్యాఖ్యాత రజత్‌ శర్మ సల్మాన్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘‘మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టే మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటించడం ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా?’ అని అడిగారు.

క్షమాపణ చెప్పేది లేదంటున్న వైసీపీ క్యాడర్, చెప్పాల్సిందేనంటున్న రజనీ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో YSRCPApologizeRAJINI

దీనిపై సల్మాన్‌ స్పందిస్తూ.. ‘‘ఇందులో ద్వంద్వ ప్రమాణాలు లేవు. నా అభిప్రాయంలో మహిళల శరీరాలు విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు. మన తల్లులు, భార్యలు, సోదరీమణుల్లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను’’ అని వివరించారు.