Hyderabad Cheating: ‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ వచ్చి.. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని వచ్చి నిర్మాతను మొత్తం దోచేసిన యువకుడు.. హైదరాబాద్ లో ఘటన
ఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్..’ అంటూ రవితేజ అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు.
Hyderabad, May 4: ఖడ్గం (Khadgam) సినిమాలో ‘ఒక్క చాన్స్..’ అంటూ రవితేజ (Raviteja) అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. హైదరాబాద్ (Hyderabad) లోని కృష్ణానగర్ లో నివాసముంటున్న టంగుటూరి ఎల్లలుబాబు చిన్న నిర్మాత. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ శ్రీకాంత్ అనే యువకుడు ఇటీవల ఎల్లలు బాబు వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
దీన్ని ఆసరాగా తీసుకొన్న శ్రీకాంత్.. మద్యం తాగించి మత్తులోకి జారుకున్న ఎల్లలు బాబు మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసు, 3 ఉంగరాలు, ఖరీదైన రాడో వాచీతో పాటు సొరుగులో ఉన్న రూ.50వేల నగదును తస్కరించి ఉడాయించాడు. నిందితుడు శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.