SYE RAA Facts: సైరా గురించి కొన్ని వాస్తవాలు, తెలంగాణా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెంటాడుతున్న నిరసనలు, విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న రివ్యూ, భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్..

గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అని అభిమానులను తెగ ఆందోళనకు గురిచేసిన సంగతి విదితమే.

interesting Facts-of-syeraa narasimhareddy (photo-Facebook)

October 1:  ఖైదీ నంబర్ 150 తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అని అభిమానులను తెగ ఆందోళనకు గురిచేసిన సంగతి విదితమే. అయితే ఎట్టకేలకు సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు బయోపిక్ అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా ఎవరి జీవితంపై తెరకెక్కింది కాదని సైరా చిత్ర యూనిట్ ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన తెలుగు సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిఈ సినిమా విడుదల చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సినిమాను కేవలం వినోదపరంగా మాత్రమే చూడాలని తెలిపింది. ఎంతమంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించారని తెలిపింది. ఈ సంధర్భంగా గతంలో జాతిపిత గాంధీజీ, మొగల్ సామ్రాజ్యంపై వచ్చిన సినిమాలను ప్రస్తావించింది. సినిమా చూడాలా లేదా అనే విషయం ప్రేక్షకులకే వదిలేయాలని పేర్కొంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ సినిమాను ఆపలేమని స్పష్టం చేసారు. దీంతో సినిమాకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సినిమా విడుదల కాకముందే యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమైర్‌ సంధు ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘సైరా’పై ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఉమైర్‌ సంధు రివ్యూ

ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ బిజినెస్ దాదాపుగా రూ. 150కోట్ల వరకు జరిగిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 108 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా, విదేశాలలో తెలుగు రైట్స్ కలుపుకొని మొత్తం రూ. 150 కోట్లు జరిగిందని తెలుస్తోంది. ఇక కన్నడలో కూడా ఎప్పుడు లేనంతగా దాదాపుగా రూ. 27 కోట్ల రూపాయల వరకు, హిందీలో సైతం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. 'సైరా నరసింహా రెడ్డి' అసలు బయోపిక్ కాదు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను అడ్డుకుంటామని ఒడిషాకు చెందిన కళింగసేన పార్టీ హెచ్చరించింది. 200 ఏళ్ల కిందటే అంటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది తొలి పోరాటం కాదని వారు చెబుతున్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు త‌ప్పుగా చిత్రీక‌రించి ఒడిశా ప్ర‌తిష్ట‌కి భంగం క‌లిగిస్తున్నారు. ఖుర్ధా ప్రాంతం ప్ర‌జ‌లు ప‌యికొ విప్ల‌వం పేరిట తొలి పోరాటం చేశారు. 2017లో మ‌న రాష్ట్ర‌ప‌తి ప‌యికొ విప్ల‌వంది తొలి విప్లవంగా ప్ర‌క‌టించారు. కాని సైరా ద‌ర్శ‌కుడు త‌ప్పుగా చెప్ప‌డం మ‌మ్మ‌ల్ని కించప‌రిచిన‌ట్టుగా ఉంది. ఒడిశాలో సినిమా రిలీజ్‌ని త‌ప్ప‌క అడ్డుకుంటాం అని క‌ళింగ సేన కార్య‌ద‌ర్శి అంటున్నారు. ఇదిలా ఉంటే భువనేశ్వర్‌లో ‘సైరా’ సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద కళింగసేన పార్టీ నిరసన తెలిపింది. ఆందోళనకారులు అమితాబ్‌బచ్చన్‌, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు.

సైరా ఫాక్ట్స్

ఈ సినిమాకి అన్ని భాషల్లో క్రేజ్ తీసుకురావడానికి పర భాషా నటులను తీసుకొచ్చారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్ లాంటి వారిని ఇందులో భాగస్వామ్యం చేశారు. అలాగే నయనతార, తమన్నాలు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.ఈ సినిమాలో దాదాపు 3800 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని సమాచారం. ఎమోషన్స్ తో కూడిన సినిమాలను వీఎఫ్ఎక్స్ షాట్స్ జోడించడం ఎంత కష్టమో తనకు తెలుసునని ఇటీవల రాజమౌళి సురేందర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి పెద్ద పీఠ వేశారు, ఇందుకోసం హాలీవుడ్ నుండి నిపుణులను తీసుకువచ్చారు. నాసమ్ ఫోర్ట్ వద్ద జరిగే యాక్షన్ సన్నివేశాలు, అధ్భుతంగా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సీక్వెన్స్ కోసం దాదాపు 35 రోజుల పాటు పనిచేశారు. రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. ఫారిన్ నటీ నటుల కోసం వందమందిని అడిషన్స్ చేయగా వారిలో ఏడుగురిని మాత్రమే చిత్రబృందం ఎంపిక చేసింది. నెల రోజులకు పైగా ఆడిషన్స్ నిర్వహించారు

సైరాలోని జాతర పాటకోసం 4500 మంది డ్యాన్సర్లతో దాదాపు 14 రోజుల పాటు చిత్రీకరించారు. ఒక పాటను ఇంతమంది డాన్సర్లతో తీయడమంటే సాధారణ విషయం కాదు. అంతే కాకుండా ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 72 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. జార్జియాలో సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాలో అండర్ వాటర్ ఫైట్ కూడా అదే రేంజులో ఉండబోతోంది.

సినిమా ఆదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలవబోతోందని తెలుస్తోంది. చివరిలో కూడా పవన్ డైలాగ్ తోనే సినిమా ముగుస్తుందని చిత్రవర్గాల సమాచారం. ఇందులో అనుష్క కూడా మెరవనుంది. సినిమా ఎండ్ లో ఉయ్యాల వాడ పోరాటం ముగిసిన తరువాత ఝాన్సీ లక్ష్మీభాయ్ పోరాటం కీలక భూమి పోషించినట్లుగా సినిమాలో చూపించనున్నారని సమాచారం. ఈ పాత్రలో అనుష్క కనిపించనుంది.