Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Choreographer Jani Master (Photo-/X)

Hyderabad, Sep 20: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ (Jany Master) పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు (Rape Case) చేసింది. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం ఉదయం జానీ మాస్టర్ ను  గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌ ను తీసుకొచ్చిన నార్సింగ్ పోలీసులు తొలుత రాజేంద్ర నగర్ డీసీపీ ఆఫీస్ కు ఆయన్ని తరలించారు. అనంతరం అక్కడ నుండి మరో రహస్య ప్రాంతానికి జానీ మాస్టారును తరలించి పోలీసులు విచారిస్తున్నారు. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన్ని హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది.

41 రోజుల త‌ర్వాత ఆందోళనను విరమించిన కోల్‌ క‌తా వైద్య విద్యార్థులు.. శ‌నివారం నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటామ‌ని ప్ర‌క‌ట‌న‌

ఛాన్స్ ఇప్పిస్తానని అత్యాచారం?!

హైదరాబాద్, చెన్నై, ముంబై అంటూ అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధిత యువతి జానీ మాస్టార్ పై సంచలన ఆరోపణలు చేశారు. సెట్స్ లో కూడా అసభ్యకరంగా తాకేవాడని , క్యారవాన్ లో కూడా ఎవరూ లేనిది చూసి తనపై లైంగిక దాడి చేశాడని, శారీరకంగా, మానసికంగా హింసించాడని, ఆయనతోపాటు ఆయన భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని హింసించింది అంటూ బాధిత యువతి కంప్లైంట్ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు జానీ మాస్టర్ సతీమణి గురువారం నిరాకరించడం గమనార్హం.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif