Ramoji Rao Demise: మీడియా మొగుల్ అస్తమయం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు ఇకలేరు

87 ఏళ్ల వయసులో శనివారం తెల్లవారుజామున...

Cherukuri Ramoji Rao

ఈనాడు వార్తా సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు, మీడియా మొఘుల్ చెరుకూరి రామోజీరావు అస్తమించారు. 87 ఏళ్ల వయసులో శనివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా రామోజీరావు వయోభార సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి తోడు శుక్రవారం రాత్రి తీవ్ర రక్తపోటు (హై బ్లడ్ ప్రెజర్)తో పాటు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో ఉన్న స్టార్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన చివరి శ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని నివాసానికి తరలించారు.  ఈసారి గెలిచిన ఎంపీల్లో ఒక్క‌రు కూడా అలాంటి వారు లేరు, స‌రికొత్త రికార్డు సృష్టించిన 18వ లోక్ స‌భ‌, ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారంటే?

ఇదిలా ఉంటే వ్యాపార దిగ్గజంగా, మీడియా మొఘుల్‌గా దేశ వ్యాప్తంగా రామోజీరావు గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణంతో యావత్ దేశం ఖంగుతింది. ముఖ్యంగా మీడియా రంగానికి ఇది తీరని లోటని చెప్పొచ్చు. ఏది ఏమైనా రామోజీరావు మరణంతో మీడియా రంగంలో ఓ తరం ముగిసినట్లైంది.

 



సంబంధిత వార్తలు