Mumbai Dance Group 'V' Made It To Finals On AGT: ముంబై డాన్స్ గ్రూప్ 'వి' అమెరికాస్ గాట్ టాలెంట్ షో ఫైనల్లోకి ప్రవేశించింది
వి గ్రూప్ సెమి ఫైనల్ ప్రదర్శన, షో న్యాయమూర్తులు జులియాన్నీ హౌగ్, హౌయి మండేలా & గాబ్రియేల్ల యూనియన్ లను లేచి నిలబడి అభినందించే లాగ చేసింది. వారి ప్రదర్శన అక్కడి స్టూడియో ప్రేక్షకులను కూడా అబ్బురపరిచింది.
వి గ్రూప్ వారి సెమి ఫైనల్ ప్రదర్శన కి, రణ్వీర్ సింగ్ మరియు అర్జున్ కపూర్ నటించిన గుండె సినిమాలోని "జష్న్-ఇ-ఇష్కా” పాటకు తమ డాన్స్ఆక్ట్ ను ప్రదర్శించారు.
అమెరికాస్ గాట్ టాలెంట్ 14 వ సీజన్లో వారి మునుపటి ప్రదర్శనలతో తమకు తాము ఏర్పాటు చేసుకున్న ప్రమాణాలకు అనుగుణంగా, ఈసారి కూడా 29 మంది నృత్యకారుల బృందం స్టూడియో ప్రేక్షకులను అలరించింది. వారి తిప్పలు, కొన్ని ఉత్కంఠభరితమైన విన్యాసాలతో కేవలంఒక్క వారంలో ఫైనల్స్‌కు చేరుకునే లాగా చేసాయి.
వారి డాన్స్ ప్రదర్శనకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులున్నారని, సో అందరు వారికి వోట్ వేసి వారిని గెలిపించ వలసిందిగా కోరుకుంటూ వరున్ ధావన్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
వీ డాన్స్ గ్రూప్ ఇంతకు ముందు బాజీరావు మస్తానీ లోని మల్హారి పాటకు డాన్స్ చేసి అందరిని అలరించారు.
వి - అన్‌బీటబుల్ గ్రూప్ ఇంతకుముందు స్టార్ ప్లస్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ప్లస్ 4 లో కూడా పాల్గొన్నారు. సో అందరు వారికీ వోట్ వేసి ఇంటెర్నేషల్ ప్లాట్ఫారం మీద భారతీయ్యులని వారి డాన్స్ ని విజేతలుగా నిలబెట్టాలని కోరుకుందాం.