Celebrity Vanity Van: సెలబ్రిటీలు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించే విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్‌లు చూశారా? టాలీవుడ్ స్టార్ల వ్యానిటీ వ్యాన్లు ఎలా ఉన్నాయో చూడండి.

అందులో ఉండే ఫైవ్ స్టార్ హోటెల్ వసతులు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. మన టాలీవుడ్ స్టార్ల వ్యానిటీ వ్యాన్ లు ఎలాగున్నాయో చూడండి...

మన ఫేవరేట్ సినిమా స్టార్స్ ఆన్‌స్క్రీన్ పైనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లో కూడా వారెలా ఉంటారనేది అందరిలో ఓ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల లైఫ్‌స్టైల్. వారి ఇళ్లు, వారు వాడే కార్లు, వేసుకునే దుస్తులు ఇలా వారి లైఫ్‌కి సంబంధించిన ప్రతీది ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.

అలాగే పెద్ద పెద్ద స్టార్లు వాడే కారవాన్ లను లేదా వ్యానిటీ వ్యాన్లను చూశారా? అప్పుడప్పుడూ సిటీ రోడ్లపైనా అవి కనిపిస్తుంటాయి. బయట నుంచి చూస్తేనే ఆ వ్యాన్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఆకర్శణీయంగా ఉంటాయి. ఎక్కడైనా ఔట్ డోర్ షూటింగ్‌కి వెళ్లినపుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు బ్రేక్ సమయంలో అందులోనే విశ్రాంతి తీసుకుంటారు. ఇక అందులో ఉండే వసతులు చూస్తే మాటలు చాలవు. అది ఒక చిన్న సైజ్ ఫైవ్ స్టార్ హోటల్.  స్టార్లు వారి అభిరుచికి అనుగుణంగా వారి కారవాన్  లను కూడా తీర్చిదిద్దుకుంటారు. అందులో ఒక మంచి బెడ్ రూం, హోం థియేటర్, మీటింగ్ స్పేస్, వాష్ రూంలు, కిచెన్, చిన్న బాల్కనీ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇండియాలో ఎక్కడ షూటింగ్ జరిగినా రెండురోజుల ముందే ఈ కారవాన్‌లు  ఆ లోకేషన్‌కు వెళ్లిపోయి ఆ స్టార్ కోసం సిద్ధంగా ఉంటాయి.

అల్లు అర్జున్ ఫాల్కన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ తన స్టైల్ కి ఏమాత్రం తీసుపోకుండా స్టైలిష్‌గా ఉంటుంది. దానికి ఫాల్కన్ (గరుడ పక్షి) అని పేరు పెట్టుకున్నాడు. దానిని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. 'నేను నా లైఫ్ లో ఎప్పుడూ పెద్దదే కొన్నాను, నేను ఈ స్థాయికి రావడానికి కారణం అభిమానులు నాపై కురిపించే ప్రేమనే, అందుకు వారికి ఎప్పుడూ కృతజ్ఞతుడినే' అంటూ చెప్పుకొచ్చారు.            అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వ్యానిటీ వ్యాన్ ధర రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా

మహేశ్ బాబు కారవాన్

టాలీవుడ్ లో అందరికంటే ముందు విలాసవంతమైన కారవాన్ కలిగి ఉన్నది సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఫోటోలో మహేశ్ బాబు వ్యానిటీ వ్యాన్ లోని ఇంటీరియర్ చూడవచ్చు.

లీడర్ల కారవాన్

కేవలం సినీస్టార్లు, సెలబ్రిటీలే కాదు. ఇండియాలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ కారవాన్ లు ఉన్నాయి. ఇవి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మించబడి

తగిన వసతులతో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ముఖ్యంత్రులు రాష్ట్రంలో జిల్లాల పర్యటనకు వెళ్లేటపుడు వారి కాన్వాయ్ లో ఇవి కూడా వెళ్తాయి. పర్యటనలో భాగంగా నేతలు తీరికలేకుండా గడుపుతున్నపుడు అక్కడికక్కడే కాస్త విశ్రాంతి తీసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.