Bigg Boss (Telugu season 4): బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నేటి నుంచే, కంటెస్టెంట్ వివరాలు లీక్, కరోనావైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్
నాగార్జున హోస్ట్‌గా (Nagarjuna's Bigg Boss Telugu 4) వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో షో (Bigg Boss Telugu Season 4) ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.
బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు నేటినుంచి స్టార్ మా చానల్‌లో బిగ్‌బాస్ 4 సీజన్ (Bigg Boss 4 Telugu) ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్‌గా (Nagarjuna's Bigg Boss Telugu 4) వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో షో (Bigg Boss Telugu Season 4) ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.
ఇప్పటికే మనకు నచ్చేదాని కోసం వెయిట్ చేస్తే ఆ కిక్కే వేరప్పా! ఇంకా ఒకే రోజు" అంటూ డిస్నీ హాట్‌స్టార్ కౌంట్‌డౌన్ చేస్తూ ఓ వీడియో వదిలింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా 15 మంది కంటెస్టెంట్స్ 100 రోజుల పాటు సందడి చేయబోతున్నారు.ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్స్ అంతా సెప్టెంబర్ 3వ తేదీన హోస్‌లోకి వెళ్లిపోయారు. శుక్రవారం నుంచి షూటింగ్ మొదలైంది.
బిగ్‌బాస్ 4 ప్రారంభం కాగానే అటు ఐపీఎల్, ఆ వెంటనే హిందీ బిగ్‌బాస్ 14 ప్రారంభం అవుతాయి. అప్పుడు ఏం చేసేది చెప్మా అని ఇప్పటినుంచే అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. "మరికొందరు మాత్రం పెద్దగా అప్‌డేట్స్ ఏం లేవుగా ఈ సారి", "అసలు ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా బాబు" అని కామెంట్ల రూపంలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. "అందరూ ఐపీఎల్‌కే జై కొడితే బిగ్‌బాస్ ఎవర్రా చూసేది?", "ఈసారి ఐపీల్ రాబోతోంది కాబట్టి బిగ్‌బాస్ టీఆర్పీకి గండి పడినట్లే"నని మరికొందరు జోస్యం చెప్తున్నారు. చూడాలి మరి! అది బిగ్‌బాస్ హౌస్. అక్కడ ఏదైనా జరగొచ్చు
Here's Star Maa Tweets
లీకైన జాబితా ప్రకారం.. దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్), దేవి నాగవల్లి (యాంకర్), గంగవ్వ (యూట్యూబ్ స్టార్), ముక్కు అవినాష్ (జబర్దస్త్ ఫేం), మోనాల్ గుజ్జార్ (హీరోయిన్), అమ్మ రాజశేఖర్( సినీ నృత్యదర్శకుడు), కరాటే కళ్యాణి (నటి), నోయల్(సింగర్), సూర్యకిరణ్ (సినీ దర్శకుడు), లాస్య (యాంకర్), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేం), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), అరియానా గ్లోరీ (యాంకర్, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), అభిజిత్ (లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా హీరో) ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు సినీ నటి సురేఖ వాణి, మెహబూబా దిల్ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
రేటు పెంచేసిన సల్మాన్ ఖాన్, బిగ్‌బాస్ 14కు ఒక్కో వారానికి 16 కోట్లు తీసుకోనున్నారని వార్తలు
ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4 చాలా సంచలనాలు సృష్టిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సారి కరోనా సమయం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే ఎన్నో జాగ్రత్తలతో పాటు అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సారి కూడా ఇదే జరుగుతుంది.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో బిగ్‌బాస్ షోకు సంబంధించిన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది.బిగ్‌బాస్ షూటింగ్ చేసే ప్రదేశంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ షో కోసం నాగార్జుకు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసారు.అంతేకాదు బిగ్‌బాస్ 4లో పార్టిసిపేట్స్ మధ్య భౌతిక దూరం పాటించేలా కలివిడిగా లేకుండా ఈ సారి షోను ప్లాన్ చేస్తున్నారు.సాధారణంగా కంటెస్టెంట్స్ ఫిజికల్ టాస్క్‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఫిజికల్ టాస్క్‌లు లేకుండా ముద్దు ముచ్చట్లు లేకుండా ఈ షోను రన్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
గతంలో లాగా 100 రోజులు కాకుండా.. ఈసారి 10 వారాల్లోనే ముగించాలనే నిర్ణయానికి స్టార్ మా వచ్చినట్టు సమాచారం. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా...శివ బాలాజి విజేతగా నిలిచాడు. రెండో సీజన్‌ను హీరో నాని హోస్ట్ చేయగా...కౌశల్ విన్నర్‌గా నిలిచాడు. గత సీజన్ 3ని అక్కినేని నాగార్జున హోస్ట్ చేయగా...సినీ నేపథ్యగాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా, టీవీ హోస్ట్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ 4 సీజన్ కోసం నాగార్జునకు నిర్వాహకులు భారీ మొత్తంలో పారితోషకం ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు కేవలం నాగార్జున కోసం పర్సనల్ డాక్టర్స్.. పర్సనల్ అసిస్టెంట్స్ కోసమే రూ. 3 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం.