Anchor Anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై, షాక్ లో అభిమానులు ఓటీటీ సంస్థతో బిగ్ డీల్, రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, ఇక అనసూయ అందాలు ఓటీటీకే పరిమితం..
రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు. ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు.
Anasuya Goodbye to Jabardast comedy Show: అందానికి మరో పేరు అనసూయ అనొచ్చు. బుల్లితెర సాక్షిగా అనసూయలోని గ్లామర్ యాంగిల్ బయటపడింది. జబర్దస్త్ షో వేదికగా అనసూయ సోయగాలు సృష్టించిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత కచ్చితంగా అనసూయదే. హాట్ నెస్ కోరుకునే టెలివిజన్ ఆడియన్స్ కి అనసూయ అదృష్టంలా దొరికింది. జబర్దస్త్ లో నాన్ స్టాప్ కామెడీ ఒకెత్తయితే.. అనసూయ అందాలు మరొక ఎత్తు. కేవలం అనసూయ(Anasuya Bharadwaj) కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.
జబర్దస్త్ షో పిచ్చ పాప్యులర్ కాగా... యాంకర్ అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిగా ఫుల్ బిజీ అయ్యారు. స్టార్ హీరోల చిత్రాలలో కీలక రోల్స్ చేస్తున్న ఆమె, మరోవైపు హీరోయిన్ గా ఆఫర్స్ పెట్టేస్తున్నారు.
అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా మూవీలో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. దర్జా మూవీలో ఆమె లుక్ లేడీ డాన్ ని పోలి ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ.
అనసూయ చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు. ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.
నటిగా, యాంకర్ గా ఊపిరి తీసుకోలేనన్ని షెడ్యూల్స్ అనసూయకు ఉన్నాయి. ఎంత తీరిక లేకున్నా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని మాత్రం అనసూయ మర్చిపోదు. హాట్ ఫోటో షూట్స్ తో వాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటారు.
అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకొని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో జత కట్టనుందనే వార్తలు వస్తున్నాయి. అందులో అనసూయ కోసం ప్రత్యేకంగా రెండు రియాలిటీ షోస్ డిజైన్ చేసినట్లు సమాచారం. అలాగే సినిమాల్లో కూడా వరుస చాన్సులు రావడంతో జబర్దస్త్ చేసేందుకు అనసూయకు తీరిక లేకుండా పోతోందట. సదరు ఓటీటీ సంస్థ అనసూయకు దిమ్మతిరిగిపోయే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.