AP Budget Sessions 2022: అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఏడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్లపై కొనసాగుతున్న చర్చలు
tammineni sitaram in assembly(Photo-Video Grab)

Amaravati, Mar 16: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్లపై చర్చిస్తున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖల పద్దులపై అసెంబ్లీలో (AP Assembly Budget Sessions) ఈ రోజు చర్చ జరగనుంది. నేటి సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. ఏడో రోజు కూడా సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ (AP Budget Sessions 2022) నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం (11 TDP MLAs suspended for the day) తీసుకున్నారు. 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్‌ చేశారు. అశోక్‌, రామ్మోహన్‌, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్‌, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెన్షన్‌ చేశారు.టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు టీడీపీ బండారం బయటపెడతానన్నారు. మీ బండారాలపై సమాధానం చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాల్‌ విసిరారు.

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడింది, ఏపీకి మరో రెండు సార్లు జగన్‌ సీఎంగా కొనసాగాలి, అప్పుడే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని తెలిపిన సినీ నటుడు సుమన్

టీడీపీ సభ్యులు రోజూ సభను అడ్డుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు. శవ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌ అని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లారని దుయ్యబట్టారు. పుష్కరాల్లో మృతిచెందిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా? అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ ప్రతిరోజూ స్పీకర్‌ చైర్‌ను కించపరిచేలా ప్రవర్తిస్తోందన్నారు. చంద్రబాబుకు భవిష్యత్‌పై ఆశలు పోయాయి. చంద్రబాబును పచ్చ పత్రికలు, ఛానెళ్లు భూజానికెత్తుకుని మోస్తున్నాయని కన్నబాబు ధ్వజమెత్తారు.

జగన్ సింగిల్‌గానే పోరాడతారు, పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి, ఎప్పుడు ఏ గుర్తుకు ఓటేయమంటారో తెలియదని వ్యంగ్యం విసిరిన మంత్రి పేర్ని నాని, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు

చనిపోయిన వ్యక్తులకు పార్టీలను, కులాన్ని అంటగట్టి టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయదుర్గానికి చెందిన వ్యక్తి మర్కెట్‌ యార్డ్‌లో విత్తనాలను తీసుకొని ఇంటికొచ్చి మళ్లీ బయటకెళ్లి చనిపోయారని తెలిపారు. అయితే సహజ మరణాన్ని కూడా విత్తన పంపిణీలో చనిపోయారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ నెత్తికెక్కి తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఆ శవాలు అప్పుడు కనపడలేదా అని ప్రశ్నించారు.

ఆ 420 బ్యాచ్ సీఎంపై బురద చల్లాలని చూస్తోంది, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని

టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు టీడీపీ బండారం బయటపెడతానన్నారు. మీ బండారాలపై సమాధానం చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాల్‌ విసిరారు.