Suman on YS Jagan Govt: పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడింది, ఏపీకి మరో రెండు సార్లు జగన్‌ సీఎంగా కొనసాగాలి, అప్పుడే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని తెలిపిన సినీ నటుడు సుమన్
Hero Suman (Photo-Video Grab)

Amaravati, Mar15: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చాలా బాగుందని సినీ నటుడు సుమన్ (Suman on YS Jagan Govt) కితాబునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పేదల్లో చిరునవ్వులు నింపాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ మరో రెండు సార్లు ముఖ్యమంత్రి (Actor Suman Comments about CM YS Jagan) కావాలని చెప్పారు. ఒకే వ్యక్తికి మూడు సార్లు సీఎంగా అవకాశం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సుమన్... అక్కడ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని చెప్పారు. సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. సినిమాల్లోకి వెళ్లాలని ఓ మెకానిక్‌ సలహా ఇవ్వడంతోనే తాను ఈ రంగానికి వచ్చానని, అందుకే మెకానిక్‌లంటే తనకు అభిమానమని తెలిపారు. ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్‌ కలాం తన మంచి మిత్రుడని పేర్కొన్నారు.

ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌, సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం జగన్ ఆగ్రహం

సినిమా పరిశ్రమ బాగుండాలని ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువే చేసిందని సుమన్‌ (Tollywood Actor Suman) అన్నారు. బయ్యర్లు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో ‘పల్లె గూటికి పండుగొచ్చింది’ ఆడియో విడుదల చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ సినీ పరిశ్రమకు చేసిన దానికి తామంతా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇంకా చేయగలిగినంత చేస్తామని సీఎం చెప్పారని, ఏపీలో స్టూడియోలు స్థాపించాలని కోరారని అన్నారు. రాష్ట్రంలో మంచి షూటింగ్‌ స్పాట్‌లు ఉన్నాయని చెప్పారు.

వైయస్ జగన్ ఎన్నో కష్టాలుపడి ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు. మరోవైపు మహిళలకు జగన్ తన కేబినెట్ లో కీలక స్థానాలు కట్టబెట్టడడం శుభపరిణామమన్నారు. జగన్ కేబినెట్ లో ఒక మహిళకు డిప్యూటీ సీఎం, మరో మహిళా ఎమ్మెల్యేకు హోంమంత్రిత్వ శాఖ కట్టబెట్టం జగన్ కే చెల్లిందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుమన్ కోరారు. అన్ని రంగాలను సమన్వయం చేస్తున్న సీఎం జగన్ సినీ ఇండస్ట్రీపై కూడా దృష్టిపెట్టాలని కోరారు. సినీ ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చి అన్నివిధాల ఆదుకోవాలని కోరారు.

జగన్ చేపట్టిన కార్యక్రమాలు కేబినెట్ నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తే వచ్చే ఐదేళ్లు కూడా సీఎం వైఎస్‌ జగన్‌నేని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమిపాలవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణమని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని హీరో సుమన్ అభిప్రాయపడ్డారు.