Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బాగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు.

Chalaki Chanti (Photo-Twitter)

Hyderabad, April 23: నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్స్ వేశాడు చంటి. జబర్దస్త్(Jabardasth) లో అవకాశం రావడంతో చంటి ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. జబర్దస్త్ లో చలాకి చంటి(Chalaki Chanti) పేరుతో స్కిట్స్ వేస్తూ తన కామెడీతో నవ్విస్తూ మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకొని అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. చలాకి చంటి జబర్దస్త్ లో నటించడమే కాక, పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడా చేశాడు. పలు షోలలో పాల్గొన్నాడు. సినిమాల్లో కూడా నటించాడు. గత సంవత్సరం బిగ్ బాస్ లో పాల్గొన్నాడు చంటి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని షోలలో పాల్గొన్న చంటి ఇటీవల ఎక్కువగా కనపడట్లేదు.

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం 

అయితే కొద్ది రోజుల క్రితం చంటికి తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారట. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బాగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు. చంటికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ప్రస్తుతం ఇంకా చికిత్స తీసుకుంటున్నాడని తెలియడంతో అతని అభిమానులతో పాటు జబర్దస్త్ నటులు, పలువురు టీవీ ప్రముఖులు అతను త్వరగాకోలుకోవాలని కోరుకుంటున్నారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ