Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం

ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం
Sharath Babu (Credits: Twitter)

Hyderabad, April 23: ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు (Sharath Babu) (71) ఆరోగ్యం (Health) విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో (Ill) బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌ (Hyderabad)లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్‌) కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపాయి.

Pawan OG Movie Update: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'ఓజీ' సినిమా... ‘సముద్రఖని’ తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 23, 2023 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).