Chandrababu On His Arrest: త‌న‌ అరెస్టు గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయిన చంద్ర‌బాబు, అన్ స్టాప‌బుల్ షోలో ఆయ‌న పంచుకున్న వివ‌రాలివే

నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు.

Unstoppable Season 4

Hyderabad, OCT 25: ఆహా ఓటీటీలో (AHA) బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable) మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు గెస్ట్ గా రాగా ఇటీవల ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అయింది. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో చంద్రబాబు రాజకీయాలు, పవన్ కళ్యాణ్, ఫ్యామిలీ గురించి చాలా మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రావడంతోనే మొదటి ప్రశ్న అరెస్ట్ గురించి అడిగారు బాలయ్య.

Pushpa 2 Grand National Press Meet: పుష్ప ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్, రేపు మెగా ప్రెస్ మీట్ పెడుతున్న చిత్ర యూనిట్, ఎందుకు అనేది మాత్రం స‌స్పెన్స్ 

దీనికి చంద్రబాబు (Chandrababu Got Emotional) సమాధానమిస్తూ.. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు.

Mahesh Babu: నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి, పి.గన్నవరంలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్లెక్సీలు, వీడియో ఇదిగో.. 

ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలా జరగదు. తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసాడో చెప్పి అతని సమాధానం విని నోటిస్ ఇచ్చి అప్పుడు దాని బట్టి అరెస్ట్ చేస్తారు. కానీ ఏమి లెక్కచేయకుండా ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా ఎవరో సూపర్ వైజర్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వచ్చారు. నా జీవితంలో తప్పు చేయకూడదు, చట్టం దుర్వినియోగం చేయకూడదు అని అనుకున్నాను. అలాగే ఉన్నాను ఇప్పటికి. కానీ ఆ రోజు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. నేను అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులాగా బతికాను. ప్రజలే నన్ను గెలిపించారు అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో అక్కడి ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif